ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (10:00 IST)

భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా కాపురానికి పిలుపించుకున్న భర్త.. ఎక్కడ..?

తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటే ఇక ఆ భార్యను చంపేయడమో.. లేక పుట్టింటికి పంపేయడమో చేస్తుంటారు. కానీ అలాంటి పని చేయలేదు ఓ భర్త.

తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటే ఇక ఆ భార్యను చంపేయడమో.. లేక పుట్టింటికి పంపేయడమో చేస్తుంటారు. కానీ అలాంటి పని చేయలేదు ఓ భర్త. తన భార్య తప్పు తెలుసుకుంటుందని కాపురానికి పిలుపించుకున్నాడు. చిత్తూరు జిల్లా దుర్గానగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
రెండేళ్ళ క్రితం చిత్తూరు దుర్గానగర్ కాలనీలో నివాసముండే ప్రకాష్‌, ఉమామహేశ్వరికి పెద్దలు పెళ్లి చేశారు. వివాహం తర్వాత ప్రకాష్‌ సౌదీకి వెళ్ళిపోయాడు. ఉమా మహేశ్వరికి పెళ్ళి కాకముందే పవన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను జాగ్రత్తగా దాచుకున్నారు కూడా. 
 
ఉమామహేశ్వరికి పెళ్ళయిన తర్వాత ఆమె భర్త కువైట్‍లో ఉండటం డబ్బులు బాగా సంపాదిస్తుండటంతో ఆమె వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని పవన్ కుమార్ పన్నాగం పన్నాడు. నువ్వు నాతో వచ్చెయ్.. నీ భర్త దగ్గర డబ్బులు తీసుకురా లేకుంటే మన ఫోటోలను నీ భర్తకు పంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాదు తనతో ఒకరోజు పాటు భార్యలా గడపాలని కూడా బెదిరించాడు. 
 
పవన్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో ఉమామహేశ్వరి చేసేది లేక పవన్ కుమార్ ఇంటికి వెళ్ళింది. దీంతో పవన్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ వీడియోను చిత్రీకరించి పదే పదే ఆమెను లొంగదీసుకుంటూ వచ్చాడు. అంతటితో ఆగలేదు. ఆ వీడియోలన్నింటినీ నీ భర్తకు పంపుతాను.. నీ దగ్గర ఉన్న డబ్బులను తెచ్చివ్వు అంటూ బెదిరించసాగాడు. దీంతో ఉమామహేశ్వరి అసలు విషయాన్ని భర్తకు చెప్పింది. తాను మోసపోయిన విషయాన్ని కూడా భర్తకు చెప్పి బోరున విలపించింది. అయితే భర్త ప్రకాష్‌ ఆమెకు తోడుగా నిలబడ్డాడు.
 
కువైట్ నుంచి చిత్తూరుకు వచ్చి తన భార్యను పోలీస్టేషన్‌కు తీసుకెళ్ళి ఫిర్యాదు చేయించాడు. తన భార్య మోసపోయిందని, ఆమె లాగా ఎవరూ మోసపోకూడదని చెబుతున్నాడు. భార్య తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిందని, అదే తనకు చాలని చెబుతున్నాడు. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు. ప్రస్తుతం ఉమామహేశ్వరి ఆరునెలల గర్భిణి.