సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (09:02 IST)

పైన పటారం.. లోన లొటారం :: స్పా, మసాజ్‌ పార్లర్లలో వ్యభిచారం

దేశంలోని స్పా, మసాజ్ కేంద్రాల పరిస్థితి "పైన పటారం.. లోన లొటారం" అన్న చందంగా మారాయి. పేరుకే స్పా, మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు ప్రకటన బోర్డులు వేలాడదీస్తున్నారు. కానీ లోన మాత్రం పక్కా వ్యభిచారం న

దేశంలోని స్పా, మసాజ్ కేంద్రాల పరిస్థితి "పైన పటారం.. లోన లొటారం" అన్న చందంగా మారాయి. పేరుకే స్పా, మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు ప్రకటన బోర్డులు వేలాడదీస్తున్నారు. కానీ లోన మాత్రం పక్కా వ్యభిచారం నిర్వహిస్తున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌ ప్రాంతాల్లోని ఈ తరహా స్పా, మసాజ్‌ సెంటర్ల గుట్టును మాదాపూర్‌ డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రట్టు చేశాయి.
 
రాత్రి మాదాపూర్‌లోని తంత్రస్పా, ఆరా స్పా, సప్త, రివేరా, మోహమ్‌, బ్లీచ్‌తో పాటు 9 మసాజ్‌ సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 34 మంది థాయ్‌లాండ్‌ యువతులు, 21 మంది ఈశాన్య రాష్ట్రాల యువతులు, ఒక పంజాబీ అమ్మాయి, 9 మంది హైదరాబాదీ యువతులు పట్టుబడ్డారు. 19 మంది నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. స్పా, మసాజ్‌ కేంద్రాల నుంచి కండోమ్స్‌, లాప్‌టాప్స్, కంప్యూటర్స్ 11 స్వైపింగ్‌ మెషీన్స్‌, 28 మొబైల్‌ ఫోన్లు, రూ.3,38,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.