బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 మే 2019 (20:07 IST)

లగడపాటి సర్వేల వెనుక అసలు నిజం తెలిస్తే షాకే..

లగడపాటి రాజగోపాల్ సర్వే గురించి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడే లగడపాటి సర్వే అంటే అందరూ నమ్మేవారు. కానీ తెలంగాణాలో లగడపాటి చెప్పిన సర్వే అది మొత్తం రివర్సయిన తరువాత లగడపాటిపై అందరికీ అనుమానం తలెత్తుతోంది. తాజాగా జరిగిన ఏడు విడతల సర్వే ఫలితాల్లో లగడపాటి ఇచ్చిన సర్వేను విశ్లేషకులే నమ్మడం లేదు. లగడపాటి అసలు ఈ సర్వేలు చేయడం వెనుక కారణమేంటో తెలిస్తే ఖచ్చితంగా షాకవ్వాల్సిందే.
 
ఇప్పటికే ఎపిలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై కోట్ల రూపాయలు రహస్యంగా బెట్టింగ్‌లు జరిగాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే తాను వెల్లడించే సర్వేతో బెట్టింగ్‌లు మరింత పెరుగుతుందని, అలా సర్వే చెబితే బెట్టింగ్ రాయుళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని కోట్ల రూపాయలు లగడపాటి సంపాదించాడన్న ప్రచారం ఉంది. 
 
టిడిపికి అనుకూలంగా లగడపాటి సర్వే ఫలితాలను వెల్లడించాడు. ఇలా సర్వే ఫలితాలను వెల్లడిస్తే అందరూ టిడిపిపైనే ఎక్కువగా బెట్టింగ్ కడతారన్నది నమ్మకం. ఇలా కొంతమంది తన కోటరీలోని వారితోనే బెట్టింగ్‌లు కట్టించి లగడపాటి లబ్ధి పొందుతారంటూ ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం వున్నదో?