శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 4 జూన్ 2016 (19:13 IST)

తెదేపాకు కాక పుట్టిస్తున్న జగన్... కేసీఆర్ స్టైల్‌లో... బాబు సచ్చినట్టు చేస్తాడు... రాయలసీమలో అంతే...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిల్లో మాటలు గారడీ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమలో మోసం చేసిన వాడిని చెప్పుతో కొడతామని అంటారని సమర్థించుకున్నారు. అంతేకాదు... ఏదైనా సాధించాలనుకుంటే చెప్పులు చూ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిల్లో మాటలు గారడీ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమలో మోసం చేసిన వాడిని చెప్పుతో కొడతామని అంటారని సమర్థించుకున్నారు. అంతేకాదు... ఏదైనా సాధించాలనుకుంటే చెప్పులు చూపించి మరీ సాధించుకుంటారని చెప్పిన ఆయన, గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు సచ్చినట్లు చేస్తారంటూ ఒకటికి రెండుసార్లు ఆ పదాన్ని వాడారు. 
 
ఆయన పదాన్ని వాడేసి.. రాయలసీమలో అంతే అంటుంటే... గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాలుకలు కోస్తా... ముఖంపై ఉమ్మేస్తా... ఆంధ్రోళ్లకు సిగ్గులేదు... ఇత్యాది పదాలన్నీ ఒక్కసారి మళ్లీ ముందుకు వచ్చినట్లు అనిపిస్తోంది. మొత్తమ్మీద చెప్పు మాట తప్పు కాదని జగన్ మోహన్ రెడ్డి సమర్థించుకుంటున్నారు. పైగా తను అన్నమాటలో తప్పేమైనా ఉందా... చంద్రబాబును చెప్పుతో కొట్టాలి అనే మాటను సమర్థించేవాళ్లంతా చేతులు పైకెత్తి చూపాలి అంటూ అనంతపురంలో మాట్లాడుతూ అడిగారు. 
 
చేతులు పైకెత్తిన వారివైపు చూపిస్తూ... ఈ క్లిప్పింగులను చంద్రబాబు నాయుడు తెప్పించుకుని చూసుకుంటే అప్పటికైనా మారుతారేమోనని అన్నారు. ఇంతలో ప్రజల మధ్యలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. దీనిపై జగన్ మాట్లాడుతూ.... తన ప్రసంగాలను అడ్డుకునేందుకు ఇలా ఎద్దులను కూడా పంపిస్తున్నారు. ఐనా ఈ ఎద్దుకు మానవత్వం ఉంది... అది చంద్రబాబు నాయుడులా కాదు అంటూ మరో సెటైర్ వేశారు. ఇలా మొత్తమ్మీద తెదేపాను కాకపెట్టిస్తున్నారు జగన్.