శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (10:23 IST)

ఏ రెడ్డిని తృప్తిపరచడం కోసం ఈ నిర్ణయం?: మాజీ మంత్రి జవహర్

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలనేపథ్యంలో, ఎన్నికలసంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా తాము కోర్టునిఆశ్రయిస్తామని ఉద్యోగులసంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి  చెప్పడం చూస్తుంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి అనుమాయుడిగానే  మాట్లాడినట్టు స్పష్టమవుతోందని టీడీపీనేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ఆరోపించారు.

ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలచేశాక కూడా, ఉద్యోగుల సంఘం నేతచేస్తున్న ప్రకటనలు చూస్తుంటే, విడ్డూరంగా ఉన్నాయన్నారు.  కరోనా వల్ల పోలీసులు, ఉపాధ్యాయులు బలైపోయారని చెప్పి ముసలికన్నీరు కారుస్తున్న చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వం పాఠశాలలు తెరిచి, విద్యార్థులు, ఉప్యాధ్యాయులు కరోనా బారిన పడేలాచేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. 
 
వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్ గురించి, ఉద్యోగులకు అందాల్సిన డీఏలు, పీఆర్సీ బకాయిలగురించి ఛంద్రశేఖర్ రెడ్డి ఏనాడైనా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదన్నారు.  ఉపాధ్యాయులు, ఇతరఉద్యోగ సంఘాల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం ఎందుకు చేయడంలేదని జవహర్ ప్రశ్నించారు.

మేథావులని చెప్పుకునే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నేతలంతా జగన్ కు భయపడికొందరు, భక్తితో కొందరు వ్వవహరిస్తున్నారని వారిమాటల్లోనే అర్థమవుతోందన్నారు. ఉద్యోగులకుసగం జీతాలు ఇచ్చినప్పుడుకూడా నోరుతెరవని చంద్రశేఖర్ రెడ్డి, నేడు ఎస్ఈసీ నిర్ణయాన్ని ఖాతరుచేయమని చెప్పడం ఆయనలోని స్వామిభక్తికి సంకేతమన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, ఏరెడ్డిని తృప్తిపరచడానికి పనిచేస్తున్నారో చెప్పాలన్నారు. 

చంద్రశేఖర్ రెడ్డి తన వ్యాఖ్యలతో ఉద్యోగసంఘాలను కూడా గందరగోళపరుస్తున్నాడన్నారు. మూడు రాజధానులపై సెక్రటేరియట్ లో మాట్లాడిన మహిళా ఉద్యోగులను అకారణంగా తొలగించిననాడు చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నారు. జగన్ భజనబృందంలో  ఉండాలనే కోరిక, ఆయనకు బలంగాఉంటే, వైసీపీలో చేరి ఆ పార్టీకండువా వేసుకునే పనిచేయవచ్చని జవహర్ ఎద్దేవాచేశారు.

కొందరు మంత్రుల బాటలోనే ఆయనబూతులు మాట్లాడినా కూడా ఎవరూ అడగరన్నారు. ఏ ఉద్యోగ సంఘం నేతా ప్రవర్తించనివిధంగా చంద్రశే ఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఉద్యోగులసంఘాన్ని పట్టించుకోకుండా, జగన్మోహన్ రెడ్డి తృప్తికోసం పనిచేయడం సరికాదన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన అనేకసమస్యలపై స్పందంచని చంద్రశే ఖర్ రెడ్డి, నేడు ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి విరుద్ధంగాకోర్టుని ఆశ్రయిస్తానని చెప్పడం, ఆయనవ్యక్తిత్వానికే మాయనిమచ్చలా మిగులుతుందన్నారు. కరోనా ఉందనిచెబుతున్న చంద్రశేఖర్ రెడ్డి, ఆసాకుతో తన సంఘాన్ని తాకట్టుపెట్టి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆయన మాటల్లోనే తేలిపోయిందన్నారు.