శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (09:36 IST)

10 కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు.. పాక్‌తో యుద్ధం చేయాల్సిందే: జేసీ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 10 కోట్ల మంది చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే పాకిస్థాన్‌, భారతదేశం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం నేర్పించిన క్రమశిక్షణే ఈ రోజు భారతీయులంతా పాటిస్తున్నారంటూ పాలకులకు చురక అంటించారు. ప్రతి రోజు సైనికులు చనిపోవడం కన్నా యుద్ధమే మంచిదన్నారు. పాకిస్తాన్‌ అణుబాంబు వేసినా దానిని ఆపగలిగే శక్తి భారతకి ఉందన్నారు.