శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:31 IST)

ఏపి రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌గా జస్టిస్ రాజా ఇళంగో బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

ఏపి రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా హైకోర్టు ఏపీ&తెలంగాణా రిటైర్డ్ జడ్జి జస్టిస్ రాజా ఇళంగో సోమవారం ఉదయం పదవి బాధ్య‌త‌లు స్వీకరించారు.

విజయవాడలోని ఆర్టీసీ  కాంప్లెక్స్‌లోని పరిపాలనా భవనం 4వ అంతస్తులోని ఏపి టిడ్కో కార్యాలయంలో పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జస్టీస్ రాజా ఎలాంగో చేత చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం కార్యదర్శి శ్యామలరావు, లా డిపార్ట్మెంట్ కార్యదర్శి జి.మనోహర రెడ్డి, ఎపేర ఛైర్మన్ వి.రామనాధ్, సభ్యులు ముళ్ళపూడి రేణుక, చందు సాంబశివరావు, సిస్ట విశ్వనాథ్, ఏపియుఎఫ్ఐడిసి ఎండి మరియు ఏపిజిబిసిఎల్ ఎండి ఎన్.చంద్రమోహన్ రెడ్డి, ఏపి టిడ్కో ఎండి ఏం.దివాన్ మైదీన్, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సి.వి.చంద్రయ్య, డిటిసిపి బి.రాములు, శాక్ ఎండి పి.సంపత్‌కుమార్, ఏఏంఆర్ సి ఎండి ఎన్.పి.రామకృష్ణ రెడ్డి, ఏపీఆర్ ఎస్సీఎల్, ఏపీ హెచ్ బి, డీల్‌ వీసీ అండ్ ఎండి బి.రాజగోపాల్, ఏపీయుఐఏ ఎంఎల్ కార్యనిర్వహణ అధికారి ప్రకాష్ గౌడ్ తదితరులు ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ఛైర్మన్ జస్టిస్ రాజా ఇళంగోకు అభినందనలు తెలిపారు.

జస్టిస్ రాజా ఇళంగో 23 సెప్టెంబర్  1955 న జన్మించారు. 15 నవంబర్ 1978, నుండి ఆయన న్యాయవాద వృత్తిలో  ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ హైకోర్ట్ నందు జడ్జ్‌గా బాధ్య‌త‌లను నిర్వహించి తదనంతరం హైదరాబాద్ హైకోర్ట్‌కు బదిలీ అయ్యారు.  ఏపీ&తెలంగాణా హైకోర్టు జడ్జిగా బాధ్య‌త‌లను నిర్వహించడం జరిగింది.