శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 మే 2016 (09:23 IST)

కేటీఆర్ ఓ బచ్చా.. వాళ్ల నాయన మాట్లాడితే స్పందిస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి బచ్చాలు విసిరే సవాళ్ళకు స్పందించాల్సిన పనిలేదన్నారు. కానీ, కేటీఆర్ నాయన, తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తాను అని తేల్చి చెప్పారు. 
 
ఈనెల 16వ తేదీన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే పీసీసీ పదవి వదులుకుంటారా? అని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరిన విషయం తెల్సిందే. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో, జిల్లాలో కనీవినీ ఎరుగని కరువు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కరువు సహాయక చర్యలు చేపట్టేట్లు చేస్తామన్నారు.