ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (12:19 IST)

ప్రేమించానని.. ఒకరోజు రాత్రంతా గడిపి.. ఆ తరువాత(వీడియో)

ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సాధారణమైపోయింది. ఒకరు ఇద్దరు కాదు. ఎంతోమంది అమ్మాయిలు ఇలాగే మోసపోతున్నారు. తాజాగా శ్రీకాళహస్తికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. యువకుడి మాటలను నమ్మిన రేణుక నిన్న ఇంటిలో చెప

ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సాధారణమైపోయింది. ఒకరు ఇద్దరు కాదు. ఎంతోమంది అమ్మాయిలు ఇలాగే మోసపోతున్నారు. తాజాగా శ్రీకాళహస్తికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. యువకుడి మాటలను నమ్మిన రేణుక నిన్న ఇంటిలో చెప్పకుండా రాజ్ కుమార్‌తో కలిసి బయటకు వచ్చేసింది.
 
నిన్న రాత్రి రేణుకను బండార్లపల్లిలోని తన స్నేహితుని ఇంటికి తీసుకెళ్ళిన రాజ్ కుమార్ ఆమెను లోబరుచుకున్నాడు. రాత్రంతా ఆమెతో గడిపాడు. తెల్లవారు జామున ఆమెను తీసుకుని శ్రీకాళహస్తి ఆలయం వద్ద వదిలి వెళ్ళిపోవడానికి ప్రయ్నతించాడు. 
 
విషయాన్ని గమనించిన స్థానికులు రాజ్ కుమార్, రేణుకలను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. రాజ్ కుమార్‌కు దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు. రేణుకకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.