శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (10:55 IST)

పెళ్లి కుదిరింది.. పెళ్లి కూతురు ఎవరనేది సస్పెన్స్.. త్వరలోనే తాళిబొట్టు..?: నల్లారి కిరణ్

అవిభాజ్య ఏపీకి చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వద్దని గట్టిగా పోరాడిన నల్లా కిరణ్ కుమార్ రెడ్డి.. ఆపై రాజకీయాలకు దూరంగా ఉన్న

అవిభాజ్య ఏపీకి చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వద్దని గట్టిగా పోరాడిన నల్లా కిరణ్ కుమార్ రెడ్డి.. ఆపై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన స్వగ్రామంలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సీన్లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గుర్రంకొండ పంచాయతీ ఆఫీసుకు వచ్చి వచ్చిన కిరణ్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలను పలకరించారు. 
 
అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త.. ఏమన్నా మమ్మల్ని ఏదో ఒక పార్టీలోకి తోయండన్నారు. మీరు నోరు విప్పకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇందుకు కిరణ్ ఆసక్తికరంగా స్పందించారు. 'ఇప్పటికే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవరన్నది రహస్యం. త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తెలుస్తుంది. శుభలేఖలు అందరికీ వస్తాయి. తొందరపడద్దు' అని అన్నారు.