చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేష్, కాసాని
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు.
ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.