ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 31 మార్చి 2017 (13:26 IST)

హోంమంత్రిగా నారా లోకేష్‌...? మరి చినరాజప్ప?

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి పెద్దల సభలో మొదటిసారి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు అదృష్టం మీద అదృష్టం వరిస్తోంది. అసలు ప్రజాప్రతినిధిగా కూడా పోటీ చేయకుండా కేవలం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై నేరుగా పెద్ద సభలోకి వెళ్ళారు నారా లోకేష్‌. కుమారుడిని ఆ

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి పెద్దల సభలో మొదటిసారి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు అదృష్టం మీద అదృష్టం వరిస్తోంది. అసలు ప్రజాప్రతినిధిగా కూడా పోటీ చేయకుండా కేవలం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై నేరుగా పెద్ద సభలోకి వెళ్ళారు నారా లోకేష్‌. కుమారుడిని ఆలస్యంగా తీసుకొచ్చిన చంద్రబాబు కేబినెట్లో మంచి స్థానం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే లోకేష్ బాబుకు కీలక శాఖ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది. అది కూడా హోంమంత్రేనట.
 
ఇప్పటికే హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. కానీ ఉపముఖ్యమంత్రి పదవిని మాత్రం రాజప్పకు ఉంచి హోంను లాక్కోవాలన్న ఆలోచనలో బాబు ఉన్నారట. ఆలోచనే కాదు ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఇక ఆ శాఖను తన కుమారుడికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. కనీస అనుభవం లేకుండా హోం శాఖను ఏ విధంగా నారా లోకేష్‌ ముందుకు తీసుకెళ్ళగలరంటూ కొందరు సీనియర్ మంత్రుల వాదన చేస్తున్నారట. అయితే బాబును కాదని ఎవరూ అడ్డుచెప్పలేరు కదా. అందుకే సైలెంట్‌గా ఉన్నారట. ఎక్కువగా మాట్లాడితే ఉన్న పదవి కూడా ఊడిపోతోందనేది మంత్రుల భయంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.