ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:30 IST)

పోలవరం ముంపు గ్రామాల్లో నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం, బుధవారాల్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముంపు బాధితులతో పాటు నిర్వాసితుల సమస్యలు విని వారిని ప‌రామ‌ర్శించ‌నున్నారు. 
 
మంగళవారం భ‌ద్రాచ‌లం, టేకుల‌బోరు, శ్రీరామ‌గిరి, చింతూరులో పర్యటిస్తారు. ఎల్లుండి రంప‌చోడ‌వ‌రం, దేవీప‌ట్నం, పెద‌వేంప‌ల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేశ్ పర్యటన కొనసాగనుంది. 
 
: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలవరం ముంపు మండలాల్లో మంగళవారం పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ పర్యటన కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలు విని వారికి తగిన సూచనలు చేస్తున్నారు. ఇవాళ భ‌ద్రాచ‌లం, టేకుల‌బోరు, శ్రీరామ‌గిరి, చింతూరులో లోకేష్ పర్యటిస్తారు. బుధవారం రంప‌చోడ‌వ‌రం, దేవీప‌ట్నం, పెద‌వేంప‌ల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేష్ పర్యటిస్తారు. 
 
అంతకుముందు లోకేష్ మంగళవారం ఉదయం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
దేవస్థానం తరపున లోకేష్‌ను.. శాలువా, జ్ఞాపికతో ఆలయ ఈవో శివాజీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శాసనసభ్యులు పొదెం వీరయ్య, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టీడీపీ నాయకులు బక్కని నర్సింహులు, కొండపల్లి రామచంద్రరావు తదితరలు పాల్గొన్నారు.