ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:07 IST)

కంట తడిపెట్టిన వెంకయ్య.. ఎందుకో తెలుసా?

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి లాంటి భారతీయ జనతా పార్టీని వదిలి పెట్టడం ఎంతో బాధగా ఉం

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి లాంటి భారతీయ జనతా పార్టీని వదిలి పెట్టడం ఎంతో బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్యకు ఆ జిల్లా ప్రజలు, బిజెపి, టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు.
 
నగరంలో భారీ ర్యాలీలో పాల్గొన్న వెంకయ్యకు స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన సభలో వెంకయ్య ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తన చిన్నప్పుడే తల్లి చనిపోయిందని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను సాధారణ కార్యకర్త ఉంచి ఉపరాష్ట్రపతిగా ఎదగడానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే ముఖ్య కారణమన్నారు. 
 
కష్టపడడం ఆర్.ఎస్.ఎస్‌లో నేర్చుకుంటే క్రమశిక్షణ బిజెపిలో నేర్చుకున్నట్లు చెప్పారు. బిజెపిని వదలడం మాత్రం చాలా బాధగా ఉందని కంట కన్నీరు పెట్టారు వెంకయ్య. దీంతో స్థానిక నేతలు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. వెంకయ్య కన్నీరు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.