శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:15 IST)

హైదరాబాద్‌లో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదు... ఎందుకు?

హైదరాబాద్ నగరంలో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ కేసును నమోదు చేసింది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ కావడం గమనార్హం. ఈ తరహా కేసు నమోదు కావడం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. ఈ తరహా కేసును ఎందుకు నమోదు చేయాల్సివచ్చిందో తెలుసుకుందాం. 
 
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఖాన్ - బేగం అనే దంపతులు ఉన్నారు. వీరికి మరికొందరు జతకలిశారు. వీరంతా ఓ ముఠాగా మారి.. వ్యభిచార కేంద్రాన్ని గుట్టుచప్పుడుకాకుండా నడుపుతూ వచ్చారు. అయితే, తమ కేంద్రాలకు అవసరమైన అందమైన అమ్మాయిలను స్వదేశం నుంచే కాకుండా, విదేశాలకు కూడా తీసుకొస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ. హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసుల సాయంతో ఈ ముఠాలోని పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో యూసుఫ్ ఖాన్ దంపతులను అరెస్టు చేసింది. 
 
అలాగే, వ్యభిచార గృహంలో ఉన్న ఐదుగురు బంగ్లాదేశ్ అమ్మాయిలకు విముక్తి కల్పించారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూసుఫ్ దంపతులపై మనుషుల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశారు.