శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 24 డిశెంబరు 2021 (22:44 IST)

తిరుపతిలోని సినిమా థియేటర్లకు నో లైసెన్స్, మరెలా?

రాష్ట్రప్రభుత్వం జిఓ.నెంబర్ 35పై సినిమా థియేటర్ల యజమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం విడుదల చేసిన జివోతో ఎలా థియేటర్లను నడుపుకోగలమంటూ ప్రశ్నిస్తున్నారు. అది కూడా తెర వెనుక నుంచే... అంటే తెర ముందుకు వచ్చి ప్రశ్నించే పరిస్థితుల్లో థియేటర్ల యజమానులు లేరు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వారి ఆలోచన.

 
ఇదిలా నడుస్తుండగానే నిన్న ఒక్కరోజే సుమారుగా 11 థియేటర్లను సీజ్ చేశారు. మరో 12 థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పీలేరు, పుంగనూరు లాంటి ప్రాంతాల్లో థియేటర్లను మూసివేయడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.

 
అయితే ఎన్నో సంవత్సరాల నుంచి థియేటర్లను నడుపుతున్నా రెన్యువల్ చేసుకోకపోవడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఇది ప్రేక్షకులకు కాస్త ఆనందాన్ని కలిగించినా థియేటర్ల యజమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

 
ఈ నేపథ్యంలో తిరుపతిలో సుమారు 24కి పైగా థియేటర్లు ఉన్నాయి. ఇందులో చాలా థియేటర్లకు లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్‌లు పూర్తయినా రెన్యువల్ మాత్రం చేసుకోలేదు. ఆదాయం వస్తున్నా రెన్యువల్ చేసుకోకపోవడంతో రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. తిరుపతిలోని ప్రధాన థియేటర్లపై కూడా రెవిన్యూ అధికారులు సోదాలు చేయడానికి సిద్ధమయ్యారు.