శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (17:29 IST)

మామిడి రైతులను ఆదుకోవాలి... సీఎం జగన్‌ను కోరిన పవన్

ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. 
 
అలాగే, స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సభ్యుల ఆవేదనను తగ్గించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జనసేన పార్టీ.. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
 
తెలంగాణలో కేసీఆర్ సర్కారు క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని పవన్ ఈ సందర్భంగా కొనియాడారు. ఇంకా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇక కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమయంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈఎమ్‌ఐ చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.