శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (18:02 IST)

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల.. మొన్న కోడిగుడ్డు, నిన్న బియ్యం, నేడు పంచదార..

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల ఎక్కువైంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ప్లాస్టిక్ గుడ్లు, నిన్నటికి నిన్న ప్లాస్టిక్ బియ్యం.. నేడేమో ప్లాస్టిక్ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల ఎక్కువైంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ప్లాస్టిక్ గుడ్లు, నిన్నటికి నిన్న ప్లాస్టిక్ బియ్యం.. నేడేమో ప్లాస్టిక్ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినే తిండిని కల్తీ చేస్తూ ప్లాస్టిక్ ఆహార పదార్థాలు రావడంపై వారు మండిపడుతున్నారు. 
 
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ బియ్యంతో పాటు కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు దుకాణాల్లో ప్లాస్టిక్‌ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో కస్టమర్లు ఏ పదార్థాలు కొనుగోలు చేయాలన్నా ఆందోళన చెందుతున్నారు. బెంగళూరులోని హస్సన్‌ ప్రాంతానికి చెందిన శివకుమార్‌ రైల్వే పోలీస్. ఇతడు వారం రోజుల క్రితం ఓ దుకాణంలో మూడు కిలోల పంచదార కొనుగోలు చేశాడు. 
 
ఆ పంచదారను టీకి ఉపయోగించగా.. అందులో వేసిన చక్కెర కరిగిపోయి.. గిన్నెకు అంటుకుపోయింది. దీంతో షాక్ అయిన శివకుమార్ మీడియాతో తన గోడు వినిపించుకున్నాడు. దీనిపై ఆహార భద్రతాధికారులు రంగంలోకి దిగి.. దుకాణాలపై రైడ్లు నిర్వహిస్తున్నారు.