సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 మే 2024 (12:43 IST)

13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ - హెచ్చరించిన వాతావరణ శాఖ

rain
ఈ నెల 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఆ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణాలో వాతావరణం చల్లబడిన విషయం తెల్సిందే. ఐదు రోజుల పాటు తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్టలో ఏర్పడిన అల్పపీడనం కారణఁగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది. 
 
తెలంగాణాలో రానున్న 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, మలుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోగంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. పలుచోట్ల వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఎన్నికలు జరుగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణాలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ్ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డ్‌లలో పంటలు తడిసిపోయే అవకాశం ఉందని తెలిపింది.