బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (17:54 IST)

రోశయ్య అంత్యక్రియలు.. మూడు రోజులు సంతాప దినాలు

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు రోశయ్యతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. రోశయ్య అంత్యక్రియలు ఆదివారం (రేపు) మధ్యాహ్నం 1 గంటకు మేడ్చెల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 
 
రోశయ్య భౌతిక కాయాన్ని స్టార్ ఆసుపత్రి నుంచి అమీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు గాంధీ‌భవన్‌లో ఆయన పార్థీవదేహాన్ని పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. 
 
మరోవైపు రోశయ్య మృతికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. నేడు, రేపు, ఎల్లుండి సంతాప దినాలు అని ఓ ప్రకటనలో వెల్లడించింది.