'కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నా'ను.. కుకునూరు పల్లిలోఎస్ఐ చివరి మాటలేంటంటే!
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్‍లో ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. బ్యూటీషియన్ శిరీష్‌తో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్‍లో ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. బ్యూటీషియన్ శిరీష్‌తో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఎస్ఐ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి.
అయితే, అసలు ప్రభాకర్ రెడ్డి తన స్నేహితులతో చివరి సారి ఏమన్నాడన్న దానిపై ఆరాతీయగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'నేను కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంటాను' అని స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డిఫోటోల్లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే... ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.