1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. spandana will be accurate and will update in website

స‌త్వ‌రం స్పందిస్తాం.... వెబ్ సైట్లో పెట్టేస్తాం!

spandana
సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికగా స్పందన‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి చెప్పారు. నగరపాలక సంస్థ ప్ర‌ధాన కార్యాయలం  ద్వారా ప్రజల  సమస్యలను సత్వరమే పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకుంటార‌ని మేయర్  తెలిపారు.
 
గ‌త నెల జూలై 26న స్పంద‌న పున: ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు స్పందన కార్యక్రమాలు జ‌రిగాయ‌న్నారు. ఇందులో ప్రజలు నేరుగా  81 సమస్యల అర్జీలను అందించగా, 59 అర్జీలను పరిష్కరించామ‌న తెలిపారు. ఆర్ధిక పరమైన 20 అర్జీలు, పునపరిశీలనలో 2 అర్జీలు క‌లిపి మొత్తం 22 ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు.  
 
ప్ర‌తి  సోమవారం అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు నేరుగా అందించిన  అర్జీలను సంబందిత వెబ్ సైట్ నందు నమోదు చేసి సంబందిత అధికారులకు పంపిస్తామ‌ని మేయ‌ర్ చెప్పారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలను పరిష్కరించిన తర్వాత అర్జీదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్పందన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న‌ట్లు మేయ‌ర్ వివ‌రించారు.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
సీఎం జగన్ సిమ్లాకు ఫ్యామిలీ టూర్ - సిల్వర్ జూబ్లీ పెళ్లి వేడుకలకు ముందు..