శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (11:46 IST)

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి.. విజయవాడలో దారుణం

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి చెందింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తన సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం ఇంటికి వెళ్ళిన ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాఖీ కట్టిన రెండు గంటల లోపే ఉష చనిపోయిందని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.
 
అత్తింటివారే ఉషా మరణానికి కారణం అని ఉషా బంధువులు చెబుతున్నారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆరండల్ పేట కు చెందిన ఫణి అనే యువకుడిని ఉషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
భర్త పని కంటే ఉష సంపాదన ఎక్కువ కావడంతో అత్తింటి వారు ఆమెను తరచూ మానసికంగా వేధింపులకు గురి చేసే వారిని సూర్యనారాయణ చెబుతున్నారు. దాంతోనే తన సోదరి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.