గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (13:21 IST)

గవర్వంగా చెబుతున్నా... రేవంత్ నా సోదరుడు... : రాఖీ కట్టిన సీతక్క

రాఖీ పండగ సందర్భంగా ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ క్రమంలో రాఖీ కట్టిన ఫోటోలను రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 
 
కాంగ్రెస్ నేతలైన రేవంత్ రెడ్డి, సీతక్క మధ్య కూడా ఇలాంటి అనుబంధమే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ప్రతి రాఖీ పౌర్ణమి రోజు రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కడుతుంటారు.
 
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే సీతక్క ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు సీతక్క రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. 
 
ఈ సందర్భంగా ఆ ఫోటోలను షేర్ చేసిన రేవంత్‌ రెడ్డి.. ‘ప్రతీ ఆడబిడ్డ ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వావలంబనతో, అన్ని రంగాల్లో ఎదగాలని మనసారా కోరుకుంటున్నా’ అంటూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ సందర్భంగా రేవంత్‌కు రాఖీ కడుతున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేసిన సీతక్క.. ‘గర్వంగా చెబుతున్నాను రేవంత్ రెడ్డి నా సోదరుడు’ అంటూ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.