గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (01:56 IST)

రాఖీ పౌర్ణమి: శ్రీకృష్ణుడు-ద్రౌపది రక్షాబంధన్ గురించి..?

రాఖీ పౌర్ణమికి సంబంధించి పలు కథలు ప్రచారంలో వున్నాయి. అలా పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని , భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. 
 
అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.  
 
 
అలాగే శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతి హామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి.