గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (10:36 IST)

విజ‌య‌వాడ‌లో గంజాయి మ‌త్తులో బ్లేడ్ బ్యాచ్ స‌భ్యుడి వీరంగం

గంజాయి మత్తులో విజయవాడ నగర శివారులో ఒక యువ‌కుడు హంగామా చేశాడు. బ్లేడ్ తో పీక కోసుకున్నాడు... ఆ తరువాత స్ధానికులకు బయబ్రాంతులకు గురి చేశాడు.  పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలిస్తే, అక్కడ నుండి పారిపోయాడు. చివరికి పోలీసులు చొరవతో మళ్లీ పట్టుకొని తెచ్చి, గాయాలకు వైద్యం చేయించి, కుటుంబ సభ్యుల‌కు అప్పగించారు. 
 
విజయవాడ నగర శివారు పాయికాపురం శాంతినగర్లో గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు, మాజీ నేరస్తుడు రెడ్డిపల్లి సత్యారావు వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం సేవించి, గంజాయి మత్తులో తనని తాను బ్లడ్ తో గాయపరచుకొన్నాడు. రక్తం గాయాలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు రెడ్డిపల్లి సత్యారావు. తీవ్ర రక్తస్రావంతో ఉన్నా అతనికి సహాయ చర్యలు కోసం వ‌చ్చిన వారిని కూడా దగ్గరకు రానీయకుండా కాసేపు హల్ చల్ చేశాడు. 
సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న రూర‌ల్ పోలీసులు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడిని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల మతిస్థిమితం లేకపోవడం, మద్యం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇలా చేస్తున్నాడ‌ని స‌త్యారావు కుటుంబ సభ్యులు చెపుతున్నారు.