శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (17:11 IST)

మీ వాళ్ళు ఎవ‌రైనా అఫ్గానిస్థాన్‌లో చిక్కుపోయారా? విజ‌య‌వాడ‌లో హెల్ప్‌ డెస్క్‌

అఫ్గానిస్థాన్‌లో అరాచ‌కం పెచ్చ‌రిల్లింది. సామాన్య ప్ర‌జ‌ల్నికూడా అక్క‌డ ఊచ‌కోత కోస్తున్నారు. ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చి, త‌మ దేశానికి వెళ్లిపోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న‌సామాన్యుల‌ను కాల్చి చంపుతున్నారు. ఈ స‌మ‌యంలో మ‌న వాళ్ల‌ని ఆదుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. విజ‌య‌వాడ‌లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది.  
 
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 0866-2436314, +917780339884, +919492555089,8977925653 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు హెల్ప్‌డెస్క్‌ నంబర్లను కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి విడుదల చేశారు.