సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (14:32 IST)

3 కాదు 30 రాజధానులు పెట్టుకోండి.. జగన్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు

Tamma Reddy_Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై డైరక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు విసిరారు. రాజధానుల అంశంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. మూడు రాజధానులు కాకపోతే.. 30 పెట్టుకోండంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఏపీలో మూడు  రాజధానుల అంశం పెద్ద చర్చకు దారి తీస్తోంది. 
 
జగన్‌కు మూడు రాజధానుల అంశంపై పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అమరావతిలో గత 50 రోజుల నుంచి రైతులు కూడా ఏకథాటిగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటివరకూ టాలీవుడ్‌ నుంచి మాత్రం ఏపీ గురించి ఎవరూ ప్రత్యేకంగా మాట్లాడలేదు. అందరూ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. కానీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి.
 
ఏపీకి మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని సెటైర్లు వేశారు. ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందన్నారు. మరి కొత్తగా పేరు పెర్లు పెట్టినంత మాత్రాన పాలన ఆగిపోదు కదా అన్నారు. 
 
అలాగే మంచికో, చెడుకో అమరావతి రాజధానంటూ ప్రకటించారు. ఇప్పటికే ఆ ప్రాంతంపై వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో రెండు వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రాజధానులంటే ప్రజలకు నష్టం కలిగి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.