శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:53 IST)

ఇద్ద‌రు పిల్ల‌లుండీ, క‌ష్టాల క‌డలిలో ఆ మ‌హిళ‌... కృష్ణాన‌దిలో దూకి!

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మరోసారి తమ ఔదర్యం చాటుకున్నారు. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో...కృష్ణ‌లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఇద్దరు పిల్లలను కనిపెంచి ప్రయోజకుల్ని చేసిన ఒక మాతృమూర్తి, భర్త మరణంతో పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఆదరించటం లేదన్న మనోవేదనతో, కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
 
గుంటూరు చెందిన ఒక వృద్ధ మహిళ సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా, అది గమనించి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన అక్కడ విధులు నిర్వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్ళు పి. గంగరాజు, జి. బాబు కాపాడారు.

విధుల్లో భాగంగా అటు వెళ్తున్న తాడేపల్లి సి.ఐ. సుబ్రహ్మణ్యం, ఇది గమనించి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులు వచ్చే వరకూ మేయర్స్  హోమ్ కు తరలించారు. ఎంతో సమయస్ఫూర్తితో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు కాపాడిన ఇద్దరు పోలీసుల‌ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.