ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (14:38 IST)

తిరుపతికి పాకిన లైంగిక వేధింపుల కల్చర్.. ఉన్నతోద్యోగిపై కేసు

మహిళలపై ప్రతి చోటా వేధింపులు తప్పట్లేదు. దేశంలో మహిళలకు భద్రత కరువైంది. తిరుపతిలో కూడా లైంగిక వేధింపుల సంస్కృతి పాకింది. ఈ ధార్మిక సంస్థకు చెందిన ఏఈవో స్థాయి ఉన్నతోద్యోగి శ్రీనివాసులు తన కిందిస్థాయి మహిళా ఉద్యోగి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడనే వ

మహిళలపై ప్రతి చోటా వేధింపులు తప్పట్లేదు. దేశంలో మహిళలకు భద్రత కరువైంది. తిరుపతిలో కూడా  లైంగిక వేధింపుల సంస్కృతి పాకింది. ఈ ధార్మిక సంస్థకు చెందిన ఏఈవో స్థాయి ఉన్నతోద్యోగి శ్రీనివాసులు తన కిందిస్థాయి మహిళా ఉద్యోగి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం వెలుగులోకి రావడంతో భక్తులు షాక్ తిన్నారు. 
 
తిరుపతి శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇలాంటి పాడుపని చేసిన ఉన్నత ఉద్యోగిని వెంటనే ఆ పోస్టు నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏఈవో తన కూతురిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా ఉద్యోగి ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతంత టీటీడీలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే... టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీనివాస మంగాపురం ఆలయానికి శ్రీనివాసులు ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే అక్కడే పనిచేసే ఓ మహిళా ఉద్యోగి అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతడి నుండి తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని వేడుకుంది. చంద్రగిరి పోలీసులతో పాటు టిటిడి జేఈవో కూడా ఆమె ఫిర్యాదు చేసింది.
 
గత కొన్ని రోజులుగా అతడు తన కూతురిని వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి తెలిపింది. అయితే ఉన్నత స్థాయి ఉద్యోగి కావడంతో భయపడి ఇప్పటివరకు బైటపెట్టలేదని కానీ ఈ మధ్య అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో పోలీసులకు ఆశ్రయించినట్లు సదరు మహిళ తెలిపింది. వెంటనే టిటిడి ఉన్నతిధికారులు, పోలీసులు ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలనికి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.