గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (07:07 IST)

టీడీపీతో అంత గట్టిగా ఎలా మాట్లాడేది: వాపోయిన పవన్

రెండు రోజుల క్రితం పోలవరం రైతులతో సమావేశమైన తర్వాత సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తానేమీ తెలుగుదేశం పార్టీతో అంటకాగటం లేదని మరోసారి స్పష్టం చేసారు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ పోలవరం ప్యాకేజీ వ్యవహారంలో తాను చంద్రబాబ

రెండు రోజుల క్రితం పోలవరం రైతులతో సమావేశమైన తర్వాత  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తానేమీ తెలుగుదేశం పార్టీతో అంటకాగటం లేదని మరోసారి స్పష్టం చేసారు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ పోలవరం ప్యాకేజీ వ్యవహారంలో తాను చంద్రబాబు పట్ల మెతకవైఖరి అవలంబించలేదని వివరణ ఇచ్చారు. 
 
తెలుగుదేశం పార్టీతో తాను రాసుకు పూసుకు తిరగటం లేదని, కానీ సమస్యలను తగిన పద్ధతిలో వారి వద్దకు తీసుకెళ్లడంలో జాగ్రత్తను పాటిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో తమకు కేటాయించిన  ప్యాకేజీ విషయంలో తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, అడగ్గానే నమ్మి భూమిని స్వాధీనం చేసిన తమకు  ప్యాకేజీని పెంచాల్సిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పంచాలని రైతులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పట్ల పవన్ వ్యవహారంపై కొందరు వ్యగ్యంగా విమర్శించారు. 
 
ఆ విమర్శలకు సమాధానమిస్తూ పవన్ కల్యాణ్ తాను రెండు నాలుకలతో దేనిపైనా మాట్లాడలేనన్నారు. దాదాపు 40 సంవత్సరాల అనుభవం కలిగిన టీడీపీతో తాను కఠినంగా మాట్లాడలేనని, అందుకే సమస్యలను ఆచరణాత్మకమైన, అర్థవంతమైన రీతిలో పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.