నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు
నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.
నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ భార్య పొంగూరు రమాదేవి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఆదాల ప్రభాకర రెడ్డి, పొంగూరు నారాయణ ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.