గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (17:40 IST)

ముఖ్యమంత్రి జగన్‌కి అమరావతి రైతుల ఫోబియా

అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌కి అమరావతి రైతుల ఫోబియా పట్టుకుందన్నారు.
 
అమరావతి పేరు విన్నా, రైతుల ఉద్యమం గురించి విన్నా ముఖ్యమంత్రి భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని  బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే బటన్ సీఎం అమరావతి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు.
 
కరోనా సమయంలో ఉపాధి లేక రైతులు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బటన్ సీఎం జగన్  అమరావతి రైతులకు కూడా బటన్ నొక్కి వారికి వార్షిక కౌలు చెల్లించాలి.
 
రైతు కూలీలకు ఇస్తున్న జీవన భృతి పెంపు హామీ ఏమైంది? అమరావతి రైతులు ఆంద్రప్రదేశ్ ప్రజలు కాదా ? ఎందుకు వారిని వేరుగా చూస్తున్నారు. బటన్ సీఎం తక్షణమే రైతులకు వార్షిక కౌలు, రైతు కూలీలకు జీవన భృతి చెల్లించాలి అంటూ వ్యాఖ్యలు చేసారు.