శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (15:33 IST)

చిన్నరాజప్పను అవమానించారు.. జూ.ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారు : అంబటి రాంబాబు

నాడు సినీ నటుడు నందమూరి ఎన్టీఆర్‌ను వాడుకొని వదలివేయగా, ఇపుడు ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్పను అవమానించారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ..

నాడు సినీ నటుడు నందమూరి ఎన్టీఆర్‌ను వాడుకొని వదలివేయగా, ఇపుడు ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్పను అవమానించారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ... మంత్రులపై పెత్తనం చెలాయించడాన్ని సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మానుకోవాలని సూచించారు. 
 
డిప్యూటీ సీఎం చిన్నరాజప్పకు తనకు మధ్య ఉన్నది అభిమానపూర్వక సంబంధాలేనని నారా లోకేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం పట్ల వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ ఎంత పరిణితి చెందాడో నిన్నటి వీడియోతో అర్థమైందని చెప్పారు. పార్టీ నిర్మాణం గురించి లోకేశ్కు తెలియదనే విషయం బయటపడిందన్నారు.
 
దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోకేశ్ గెలవాలని సవాల్ విసిరారు. చిన్నరాజప్ప వ్యవహారంలో ఎడిట్ క్లిప్పింగులు కాదు.. పూర్తి వీడియోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాడుకొని వదిలేయడం, అవమానించడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.