గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (21:03 IST)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

Nadendla Manohar
ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మరింత షార్ట్ కట్ ద్వారా సేవలను అందించాలనీ, వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సిన పని లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 300 సేవలకు పైగా వాట్సప్ ద్వారా అందిస్తోందనీ, వాటిని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
 
ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా విక్రయించుకునేందుకు 70 వేల మంది రైతులు నమోదు చేసుకోగా వారిలో 16 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 
 
గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్మగానే గంటల్లోపే వారి డబ్బు వారి చేతికి అందేట్లు చూస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం నిత్యం కృషి చేస్తూనే వుంటుందని తెలిపారు.