శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (10:21 IST)

పర్యాటక బోట్లపై నిరంతర నిఘా : ఏపీ సర్కారు నిర్ణయం

పర్యాటక బోట్లపై నిరంతరం నిఘా సారించేలా ఓ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. నదులు, తీర ప్రాంతంలో నడిపే పర్యటక బోట్లపై నిరంతరం పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 
 
తొమ్మిది చోట్ల పర్యవేక్షణ కేంద్రాలు(కాల్ సెంటర్లు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాల్లో కాల్ సెంటర్​కు భూమి పూజ చేయనున్నారు. రెవెన్యూ, జలవనరులు, పోలీసు, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఇవి పని చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
 
బోటు సామర్థ్యం, అందులో ప్రయాణించే వారి రక్షణ ఏర్పాట్లు, అర్హత కలిగిన బోటు ఆపరేటర్లు వంటి కీలక అంశాలు పరిశీలించాకే ఇకపై అనుమతులు ఇవ్వనున్నారు. బోటు ప్రయాణ ప్రారంభం నుంచి తిరిగి ఒడ్డుకు చేరుకునే వరకూ వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.