ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (17:42 IST)

జగన్ ఛాంబర్ పైప్ ఒక్కటే ఎందుకు కట్ అయ్యింది? స్పీకర్ కోడెల సీఐడీ విచారణకు ఆదేశం

అమరావతి: శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేయడం వల్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోకి నీళ్లు వెళ్లినట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేసిన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం మీడియా వారికి స

అమరావతి: శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేయడం వల్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోకి నీళ్లు వెళ్లినట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభా భవనంపైన ఏసీ పైప్ కట్ చేసిన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం మీడియా వారికి స్పీకర్ చూపించి, వివరించారు. ఈ సంఘటనపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. పైప్ లైన్‌ని ఎవరో కావాలనే కట్ చేసినట్లు కనిపిస్తుందన్నారు. 
 
ఈ భవనంలో మిగిలిన పైప్‌లన్నీ బాగానే ఉన్నాయని, ఇది ఒక్కటే కట్ అయిందని చెప్పారు. సీఐడీ విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. విచారణకు కొన్ని పద్ధతులు ఉంటాయని, ఆ ప్రకారం విచారణ చేస్తారన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తారని, ఇక్కడి నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)కు పంపుతారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 
 
పైప్ కట్ చేయడం వల్ల నీరు ఛాంబర్ లోపలికి వెళితే చాలా పెద్ద స్థాయిలో విమర్శలు చేశారన్నారు. తాను రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఈ సంఘటనలో ఆ ఒక్క ఛాంబర్ లోకే నీరు వెళ్లాయని, ఇతర ఏ ఛాంబర్ లోకి నీరు వెళ్లలేదని తెలిపారు. ఈ విషయమై ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే తన వద్దకు వచ్చి అడుగవచ్చని స్పీకర్ చెప్పారు. స్పీకర్ వెంట మంత్రి నక్కా ఆనంద బాబు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, అదనపు డీజీ(ఇంటిలిజన్స్) ఏబీ వెంకటేశ్వర రావు,  ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.