మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (09:58 IST)

అమరావతి అలెర్ట్ : ప్రతి ఇంటికి పోలీసు నోటీసులు.. కొత్తవారు కనిపించారంటే..

రాజధాని అమరావతిని తరలించవద్దని, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని కొన్ని రోజుల నుండి అమరావతి రైతులు మరియు ప్రజలు నిరసనలు, దీక్షల చేపడుతున్నారు. దీనిలో భాగంగా గురువారం ప్రకాశం బ్యారేజి నందు కొందరు తలపెట్టనున్న రూట్ మార్చ్, నిరసనలు, ధర్నాలకు పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు లేనందున అట్టి కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసు వారు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టాపర్‌లు, బ్యారికేడ్ల‌తో వారిని నియంత్రించనున్నారు.
 
అమరావతి రాజధానిలోని పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్న లేక చట్ట వ్యతిరేక కార్యక్రమములు చేపట్టిన అట్టి వారిపై చర్యలు తప్పవని ఏపీ పోలీసు శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.