శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (08:27 IST)

ఏపీ జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు

ఏపీలో ఉన్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

దీంతో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంపు వర్తిస్తుంది.
స్టైఫండ్ పెంపు వివరాలు : ఎంబీబీఎస్  విద్యార్థులకు రూ.19,589, పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, ముడో ఏడాది రూ.48, 973 పెరగనుంది. అదే విధంగా పీజీ డిప్లొమా విద్యార్థులుకు మొదటి రూ.44,075, రెండో ఏడాది రూ.46524 పెంపు వర్తిస్తుంది.

సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.48,973, రెండో ఏడాది రూ.51,422, మూడో ఏడాది రూ.53,899 పెరగనుంది. ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, మూడో ఏడాది రూ.48,973 పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.