గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (12:57 IST)

I.N.D.I.A కూటమి పొత్తుకే జగన్ వెంపర్లాట : ఆర్థిక మంత్రి పయ్యావుల

payyavula
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇండియా కూటమితో పొత్తుపెట్టుకునేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెగ వెంపర్లాడుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే ఆయన ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. అలాగే, ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఆయన సూచించారు. 
 
మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందన్నారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను సభ ముందు పెట్టాలని ఆయన కోరారు. 
 
ఈ అంశఁపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాంటిది ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని గురువారమే విడుదల చేస్తున్నామని తెలిపారు.