1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Municipal Election Results Live Updates

ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పోల్ : బ్యాలెట్ ఓట్లలో కూటమి ఆధిక్యం

vote
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. అన్ని చోట్లా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. విశాఖపట్నం(జీవీఎంసీ)లో కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణికి 125 ఓట్ల ఆధిక్యం లభించింది. జీవీఎంసీలో మొత్తం 747 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉండగా.. టీడీపీకి 351, వైకాపాకు 226, ఇతరులకు 170 ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో 15 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉండగా.. అన్నీ టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌కే పోలయ్యాయి. 
 
అలాగే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కోనసీమలో మొత్తం 20 ఓట్లు ఉండగా.. కూటమి ఛైర్మన్‌ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు 16, వైకాపా అభ్యర్థి విరితా దేవికి 3 ఓట్లు వచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో కూటమి ఛైర్మన్‌ అభ్యర్థి గుండుమల శారద ముందంజలో ఉన్నారు. మొత్తం 20 ఓట్లలో ఆమెకు 16 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌కు 2, వైకాపాకు 1, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసులకు ఒక ఓటు పడ్డాయి. 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరులోనూ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ 82 ఓట్లలో కూటమి ఛైర్మన్‌ అభ్యర్థికి 45, వైకాపా అభ్యర్థికి 31, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. కడప మేయర్‌ మొదటి రౌండ్‌ పోస్టల్‌ బ్యాలెట్లలో 97కు గానూ తెదేపాకు 47, వైకాపాకు 36, ఇతరులకు 14 ఓట్లు పోలయ్యాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ కోసం రూ.275 కోట్లు