శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 22 మే 2018 (12:48 IST)

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం పడునుందా ?

ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు

ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు స్పీకర్‌ను అభ్యర్థించారు.
 
సమయం కేటాయిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకరుకు వైసిపి ఎమ్.పిలు సమాచారం ఇవ్వడంతో ఈ నెల 29న ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి కలవాలని స్పీకర్ కార్యాలయం సమాచారం పంపించింది. అందువల్ల అదేరోజు వైసీపీ ఎంపీల రాజీనామాకు ఆమోదం పడనున్నట్టు సమాచారం.