లేటుగా వచ్చినందుకు ప్రియుడిని తిట్టింది.. ఆపై డ్రైయిన్‌లోకి దూకేసింది..
వారు ప్రేమికులు. ఓ చోట కలుసుకున్నారు. అయితే ఇంతలోనే చెప్పిన సమయానికంటే లేటుగా వచ్చినందుకు ప్రేయసి చిరాకు పడింది. అంతటితో ఆగకుండా డ్రెయిన్‌లో దూకింది. ఈ ఘటన భీమవరంలో పట్టణంలో సంచలనం రేపింది. వివరాల్లోక
వారు ప్రేమికులు. ఓ చోట కలుసుకున్నారు. అయితే ఇంతలోనే చెప్పిన సమయానికంటే లేటుగా వచ్చినందుకు ప్రేయసి చిరాకు పడింది. అంతటితో ఆగకుండా డ్రెయిన్‌లో దూకింది. ఈ ఘటన భీమవరంలో పట్టణంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే... సుంకర పద్దయ్య వీధికి చెందిన పుట్ట సత్యస్వరూప(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఇంటి సమీపానికి చెందిన కనిమిరెడ్డి మహేష్(పండు)(25), ఆమె కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సత్య స్వరూప శనివారం సాయంత్రం మహేష్‌ను బయటకు వెళ్లడానికి రమ్మని కోరింది. అతను అరగంట ఆలస్యంగా కళాశాల వద్దకు రావడంతో ఆమె అతనిపై చిరాకుపడిందని, బివిరాజు విగ్రహం సమీపంలోని బైపాస్ రోడ్ బ్రిడ్జి వద్దకు వచ్చి ఒక్కసారిగా యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేసింది. ఆమెను కాపాడేందుకు మహేష్ కూడా డ్రెయిన్‌లోకి దూకినట్లు చెప్తున్నారు.
వారు కొంతసేపు నీటిలో తేలుతూ ఉన్నారని, ఎవరూ వారిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని తెలుస్తోంది. కొంతసేపటికి వారిద్దరు మునిగిపోయారు. సమాచారం అందుకున్న పైర్, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు డ్రైయిన్ వద్దకు చేరుకుని విలపించారు. శనివారం రాత్రికి కూడా వారి ఆచూకి లభ్యంకాలేదు.