బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (22:58 IST)

మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు: మంత్రి మేకపాటి

మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు.

మూడు గ్యాస్‌ కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అన్నారు. పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, సదుపాయాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, తదితర అంశాలపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

కోనాడ నుండి భీమునిపట్నం, చైనాబజార్‌ జంక్షన్‌, విశాఖపట్నం పరిధిలో బీచ్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్ల కార్పొరేషన్‌ సేవలను మరింత పెంచేలా చూడాలని పేర్కొన్నారు.

కోవిడ్‌ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇండ్రస్టియల్‌ పాలసీ ప్రకటనపై బుధవారం సిఎంతో సమీక్ష అనంతరం ప్రకటన చేస్తామని చెప్పారు.