బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:01 IST)

రామచంద్రాపురంలో బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్న కార్యక్రమం

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయ నాయ‌కులు త‌మ స్ట‌యిల్ ని మార్చుకుంటున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్నకార్యక్రమానికి  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శ్రీకారం చుట్టారు. 
 
ఉద‌యాన్నే తాను పిలిచిన వారితో ఒక పెద్ద రౌండ‌ప్ గా కుర్చీలు వేసి, బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, స‌మ‌స్య‌ల‌పై అంద‌రితో చ‌ర్చిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై స‌మ‌న్వ‌యం చేసి ప‌రిష్కార మార్గాల‌ను సూచిస్తున్నారు. మొదటి రోజు రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్‌లతో మంత్రి చెల్లుబోయిన‌ సమావేశమై, మున్సిపల్ పరిధిలోని సమస్యల‌పై చర్చించారు. 
 
పారిశుధ్యంపై వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ద చూపించాలని మంత్రి సూచించారు. స్వచ్చ, స్వేచ్చా రామచంద్రాపురం దిశగా నియోజకవర్గం ఉండాలని ఈ సమావేశంలో కౌన్సిలర్లతో త‌న ఆశభావం వ్యక్తం చేశారు మంత్రి. ఇలాగే నిత్యం వివిధ వ‌ర్గాల వారితో, అధికారుల‌తో  బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వినూత్న కార్యక్రమం ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లంద‌రితో మ‌మేకం కావాల‌ని మంత్రి ప్లాన్ చేశారు. ఉద‌యాన్నే మంత్రి గారిని క‌ల‌వ‌డం, అదీ ఆయ‌న‌తో బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం బాగుంద‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.