శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (11:36 IST)

అన్నే కాటేశాడు... చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు... ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునే పాడుపనికి పాల్పడ్డాడు. చెల్లి వరుస అయ్యే యువతిని మోసం చేసి గర్భవతిని చేశాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ మండలంలో ఈ దారుణం జరిగింది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునే పాడుపనికి పాల్పడ్డాడు. చెల్లి వరుస అయ్యే యువతిని మోసం చేసి గర్భవతిని చేశాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ మండలంలో ఈ దారుణం జరిగింది. చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు. దీంతో ఆ చెల్లి ఓ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానికంగా వజ్రకరూరు మండలానికి చెందిన 20 యేళ్ళ యువతిని వరుసకు అన్న అయ్యే వ్యక్తి నిట్టనిలువునా మోసం చేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని తన పశువాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భందాల్చించింది. ఈ క్రమంలో ఆమెకు సోమవారం కడుపు నొప్పివచ్చింది. దీంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రి చేర్పించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భందాల్చి నెలలు నిండినట్టు వెల్లడించారు. దీంతో నర్సులు ఆమెను మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
దీనిపై ఆ యువతి తల్లి స్పందిస్తూ తమ బిడ్డను స్వయానా పెద్దనాన్న కుమారుడు, వరుసకు అన్న  వంచించాడనీ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నట్టు తెలిపింది. అదేసమయంలో యువతి ప్రసవించినట్టు తెలుసుకున్న ఆ కామాంధుడు ఊరివదిలి పారిపోయాడు.