శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:08 IST)

పాల కోసం బిడ్డ... పాలివ్వలేక తల్లి ఇద్దరూ ఏడుస్తున్నారు : ఎంపీ శివప్రసాద్

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా?

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ కావాలా? అన్నది తేల్చుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం ఏపీ పరిస్థితి... పాల కోసం బిడ్డ ఏడుస్తోంది. పాలివ్వలేక తల్లి ఏడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ బతకాలంటే పౌడర్ పాలను పట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని ఆయన తాజా వ్యాఖ్యలతో పేర్కొనడం విశేషం.
 
కాగా, విభజన సమయంలో వివిధ రకాల వేషాలతో అందరి దృష్టిని ఆకర్షించిన శివప్రసాద్.. నాడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఇపుడు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేటాయించడంపై ఎలాంటి విమర్శలు చేయక పోవడం గమనార్హం.