మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (11:42 IST)

కరోనా వచ్చిందంటే.. పకోడీ షాపు యజమాని ఏం చేశాడో తెలుసా..?

ఓ  పకోడి షాపు యజమానికి కరోనా సోకింది. అంతటితో ఆ పకోడీ షాపు యజమాని ఆస్పత్రిల చేరాడా అంటే లేదు. వివరాల్లోకి వెళితే.. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ రావడంతో మెడికల్‌ సిబ్బంది ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అంతేగాకుండా అతనిని ఆస్పత్రికి తరలించేందుకు వచ్చారు. 
 
అయితే ఆ షాపు యజమాని మాత్రం పకోడీకి పిండి రుబ్బేశాను. కాస్త ఆగండి వచ్చేస్తానంటూ సమాధానమిచ్చారు. దీంతో సిబ్బంది షాకయ్యారు. బాధితుడి మాటలు విన్న మెడికల్‌ సిబ్బందికి ఓ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తేరుకుని ఆయనకు చీవాట్లు పెట్టి బలవంతంగా 108లోకి ఎక్కించారు. ఆయన కుటుంబసభ్యులను కూడా తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని, అనంతరం కుటుంబం అంతా హోంక్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. 
 
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంటే ప్రజలకు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఆ అదే వస్తుంది, పోతుందిలే అని ఆ మహమ్మారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న వాళ్లే.. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా గురించి కామెడీలు చేస్తున్నారు.