ఆదివారం, 27 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (12:28 IST)

ఎన్టీఆర్ వెంట నాతోపాటు ఇద్దరే ఉన్నారు... కాంగ్రెస్ పార్టీని వదిలేశా... దేవినేని నెహ్రూ

గత కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు దేవినేని నెహ్రూ తెరదించారు. కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త

గత కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు దేవినేని నెహ్రూ తెరదించారు. కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాను. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు 2 గంటలు బాధపడ్డా. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా.
 
నేను పార్టీలు మారడం ఎక్కువగా ఉండదు. పదవుల కోసం ఏ పార్టీలోకి మారను. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నాతోపాటు ముగ్గురం మాత్రమే ఉన్నాం, ఒకరు ఎన్టీఆర్ అయితే రెండోది నేనే. మరో ఇద్దరు ఉన్నారు. తెదేపా జెండా రూపకల్పనలోనూ నా పాత్ర ఉంది. అలాంటి పార్టీని వదిలిపెడుతున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఐతే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. 
 
మంత్రి పదవి, మరేదో ఆశించి రావడం లేదు. పార్టీకి నేనేం చేశాననేదే ఆలోచిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే చేశాను. పార్టీ మారినప్పటికీ కన్నతల్లిలా కాంగ్రెస్ పార్టీకోసం నా శక్తివంచన లేకుండా చేశాను. మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి సొంత ఇంటికి వచ్చాను" అని చెప్పారు.