శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (19:22 IST)

ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు - రేపు ఢిల్లీకి టీడీపీ, జనసేన చీఫ్‌లు

Chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం స్థానం నుంచి  పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 47 వేలకుపైగా ఓట్లతో చంద్రబాబు విజయం సాధించారు. ఈ క్రమంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.
 
మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.